![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -474 లో... నిద్రపోతున్న కాశీ దగ్గరికి స్వప్న వచ్చి.. నిద్ర లేపుతుంది. జాబ్ గురించి అలోచించి ఇందాకే పడుకున్నానని కాశీ అనగానే.. ఆలోచిస్తూ ఉంటే జాబ్ వస్తుందా? ప్రయత్నం చెయ్యాలని స్వప్న అంటుంది. అదంతా శ్రీధర్, కావేరి వింటారు. ఇప్పుడు అల్లుడు జాబ్ లేదన్న ఫీలింగ్ లో ఉన్నాడు. తనకి సపోర్ట్ గా ఉండాలి తప్ప.. ఇలా మాట్లాడకూడదని స్వప్నకి చెప్పమని కావేరీతో శ్రీధర్ అంటాడు. కార్తీక్ చూడు అన్నీ వదిలేసినా కూడా మళ్ళీ మంచి పొజిషన్ కి వచ్చాడని శ్రీధర్ అంటాడు. అది విన్న కాశీ.. అంటే నేను ట్రై చెయ్యడం లేదా అని శ్రీధర్ ని తప్పుగా అర్థం చేసుకుంటాడు.
మరొక వైపు దీప, దశరథ్ ల మాటలు సుమిత్ర, జ్యోత్స్న వింటారు. చూసావా మమ్మీ డాడ్ దగ్గరికి వెళ్లి ఎలా మాట్లాడుతుందో.. తనని ఇంట్లో నుండి పంపించమని జ్యోత్స్న అంటుంది. దీప మాట్లాడిన దాంట్లో తప్పేముందని సుమిత్ర అంటుంది. తప్పు చేసింది నేను.. నేను తప్పు చేసాను అని మీ నాన్నకి తెలుసు కానీ, ఆ తప్పు చెయ్యడానికి కారణం నువ్వేనని తెలిస్తే అప్పుడు మీ నాన్న రియాక్షన్ ఎలా ఉంటుంది. నువ్వు ఈ చాడీలు చెప్పడం మానేసి, మీ తాతయ్య చెప్పినట్టు విను అని జ్యోత్స్నకి సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది.
మరొకవైపు శ్రీధర్ దగ్గరికి తన రిలేటివ్స్ కార్డ్ ఇవ్వడానికి వస్తారు. శ్రీధర్ గురించి తన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడతారు. మరొకవైపు గ్రానీ కోపం పోగొట్టాలని కాశీకి జాబ్ ఇప్పిస్తాను.. ఎంతైనా నా సొంత తమ్ముడు కదా అని పారిజాతంతో జ్యోత్స్న అనగానే.. ఏంటి సొంత తమ్ముడా అని కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న, పారిజాతం కలిసి డైవర్ట్ చేస్తారు.
![]() |
![]() |